విమాన ప్రయాణంలో ఉన్న ఇద్దరు చిన్నారులకు అనుకోకుండా సర్ప్రైజ్ చేసిన సిబ్బంది

ABN , First Publish Date - 2021-10-06T12:57:27+05:30 IST

తమ ప్రయాణికులను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఒక కానుక ఇవ్వాలనుకున్న విమాన సిబ్బంది వారి పుట్టినరోజు వేడుకను ఆకాశ మార్గంలో ఉండగా చేయాలని నిర్ణయించింది...

విమాన ప్రయాణంలో ఉన్న ఇద్దరు చిన్నారులకు అనుకోకుండా సర్ప్రైజ్ చేసిన సిబ్బంది

తమ ప్రయాణికులను ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకున్న విమాన సిబ్బంది వారి పుట్టినరోజు వేడుకను ఆకాశ మార్గంలో ఉండగా చేయాలని నిర్ణయించింది. అమెరికాలోని కాలిఫోర్నియా నగరం సాక్రమెంటో ఎయిర్‌పోర్ట్ నుంచి సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం సెప్టెంబర్ 22న బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరే ముందు అందులో ఉన్న సిబ్బంది ప్రయాణికులను సర్ప్రైజ్ చేయాలని నిర్ణయించుకుంది. 


ప్రయాణికులలో ఇద్దరు కవల పాపలు ఉన్నారు. వారిద్దరిదీ అదే రోజు ఆరవ పుట్టినరోజు కావడంతో విమాన సిబ్బంది ఆ చిన్నారుల పుట్టినరోజు జరపాలనుకుంది. వారి పుట్టినరోజు వేడుకను జరుపుతున్నట్లు అక్కడ ఎవరికీ తెలియదు. విమాన సిబ్బంది మరికొంత మంది ప్రయాణికులతో కలిసి ఒక్కసారిగా 'హ్యాపీ బర్త్‌డే' అంటూ ఆ ఇద్దరు కవలలను పాడుతూ పలకరించారు. విమానంలోని కిటికీలను మూసేసి అక్కడున్న డిమ్ లైట్స్ ఆన్ చేశారు. ప్రయాణికులంతా ఆ ఇద్దరు చిన్నారుల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక్కసారిగా 'హ్యాపీ బర్త్‌డే' పాడాలని విమాన సిబ్బంది కోరింది.  అక్కడున్న వారంతా 'హ్యాపీ బర్త్‌డే' పాట పాడుతూ చివర్లో అనందంగా కేకలు వేసి, చప్పట్లతో వేడుకను ముగించారు.


ఈ సన్నివేశాన్ని ఒక తోటి ప్రయాణికుడు వీడియో తీసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అప్‌లోడ్ చేసిన వెంటనే ఈ వీడియోని చాలా మంది షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ప్రయాణికుల కోసం విమాన సిబ్బంది చేసిన ఆ సర్ప్రైజ్ వేడుకను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.



Updated Date - 2021-10-06T12:57:27+05:30 IST