భారత్‌ నుంచి ఆస్ట్రేలియా విమానసర్వీసులు

ABN , First Publish Date - 2021-05-15T12:54:27+05:30 IST

కరోనా నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన స్వదేశీ పౌరులను తిరిగి రప్పించేందుకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిసే పేన్‌ చె

భారత్‌ నుంచి ఆస్ట్రేలియా విమానసర్వీసులు

మెల్బోర్న్‌, మే 14: కరోనా నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన స్వదేశీ పౌరులను తిరిగి రప్పించేందుకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిసే పేన్‌ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రయాణికులను తీసుకురావడానికి సిడ్నీ నుంచి విమానం న్యూఢిల్లీ బయలుదేరినట్లు తెలిపారు. ఆక్సిజన్‌ పరికరాలను భారత్‌కు తీసుకువెళ్లిన ఆ విమానం శనివారం డార్విన్‌ చేరుకుంటుందన్నారు.  ప్రయాణికులు ఢిల్లీలో బయలుదేరేముందు వారికి పీసీఆర్‌, రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేస్తారని చెప్పారు. వారు ఇక్కడకు వచ్చిన తరువాత ఉత్తరభాగం హోవార్డ్‌ స్పింగ్స్‌లోని జాతీయ రెజిలియన్స్‌ కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంటారన్నారు. 


Updated Date - 2021-05-15T12:54:27+05:30 IST