దివాలా స్థితిలో ఎయిర్‌లైన్స్‌

ABN , First Publish Date - 2020-04-02T05:52:02+05:30 IST

దేశంలోని విమానయాన కంపెనీలన్నీ విమాన సర్వీసులు నిలిపివేయాల్సివచ్చినందు వల్ల ఆయా కంపెనీల వద్ద ఉన్న నగదు నిల్వలు త్వరితగతిన తరిగిపోతున్నాయని, అవి దివాలా స్థితిలోకి పోయే ప్రమాదాన్ని

దివాలా స్థితిలో ఎయిర్‌లైన్స్‌

దేశంలోని విమానయాన కంపెనీలన్నీ విమాన సర్వీసులు నిలిపివేయాల్సివచ్చినందు వల్ల ఆయా కంపెనీల వద్ద ఉన్న నగదు నిల్వలు త్వరితగతిన తరిగిపోతున్నాయని, అవి దివాలా స్థితిలోకి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఫిక్కీ ఏవియేషన్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. వారి దయనీయమైన స్థితిని పరిగణనలోకి తీసుకుని తగురీతిలో పలు మద్దతు చర్యలు ప్రకటించాలని కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురిలకు లేఖ రాసింది.


విమానయాన సంస్థలు, ఆయా సంస్థలకు చెందిన బ్యాంకులు జారీ చేసిన స్టాండ్‌ బై లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌, విదేశీ గ్యారంటీలు, బ్యాంకు గ్యారంటీల వంటివి 90 రోజుల పాటు వాయిదా వేయాలని ఆర్‌బీఐకి ఆదేశించాలని కోరింది. అలాగే విమానయాన సంస్థలపై ఎలాంటి వడ్డీలు, పెనాల్టీలు, జాప్యానికి చార్జీలు వంటివి విధించకుండా చూడాలని, అందుకు ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లకు ఏర్పడే ఆదాయం నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.  

Updated Date - 2020-04-02T05:52:02+05:30 IST