అయోధ్యలో విమానాశ్రయం!

ABN , First Publish Date - 2020-08-05T07:27:15+05:30 IST

రామాలయ నిర్మాణం పూర్తయ్యేలోపే అయోధ్యను పరిపూర్ణంగా అభివృద్ధి చేసి.. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మలచాలని ఉత్తరప్రదేశ్‌లోని

అయోధ్యలో విమానాశ్రయం!

లఖ్‌నవూ, ఆగస్టు 4: రామాలయ నిర్మాణం పూర్తయ్యేలోపే అయోధ్యను పరిపూర్ణంగా అభివృద్ధి చేసి.. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మలచాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.500 కోట్లతో ప్రణాళిక ప్రకటించింది. దీనిప్రకారం ప్రస్తుతం అయోధ్యలో వీఐపీల రాకపోకలకు ఎయిర్‌స్ట్రిప్‌ మాత్రమే ఉంది. ఇప్పుడు దానిని సరికొత్త విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తారు. అధునాతన రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తామని తాజా ప్రణాళికలో తెలిపారు. రూ.250 కోట్లతో జాతీయ రహదారిని విస్తరిస్తారు. రూ.54 కోట్లతో తాగునీటి సరఫరా పథకాన్ని నవీకరించనున్నారు. బస్‌స్టేషన్‌ నిర్మాణానికి రూ.7 కోట్లు కేటాయించారు. పోలీసు బలగాలకు కూడా అంతేమొత్తం కేటాయించారు. ఇక్కడి ప్రసిద్ధ తులసీ స్మారక్‌ అభివృద్ధికి రూ.16 కోట్లు ఇవ్వనున్నారు. పర్యాటక ప్రాజెక్టుల పనులను కూడా పరుగెత్తించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-08-05T07:27:15+05:30 IST