Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ భారీ షాక్!

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ భారీ షాకిచ్చింది. మొబైల్ టారిఫ్‌లను గరిష్టంగా రూ. 501 వరకు పెంచేసింది. ఈ నెల 26 నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ప్రీపెయిడ్ ప్యాక్‌పై కనిష్టంగా రూ. 20 పెరిగింది. ఎయిర్‌టెల్ తాజా ప్రకటనతో ప్రస్తుతం ఉన్న రూ. 2,498 ప్రీమియం ప్యాక్ ధర ఇకపై రూ. 2,999కి పెరగనుంది. దీని కాలపరిమితి 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అలాగే అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. 


రూ. 1,498 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇకపై రూ. 1,799కి లభించనుంది. ఇందులోనూ అవే ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మొత్తం 24 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. రూ.698 ప్యాక్ ధర ఇకపై రూ. 839కి లభిస్తుంది. రూ.2,999 ప్యాక్‌లోని అన్ని ప్రయోజనాలు ఇందులోనూ లభిస్తాయి. కాలపరిమితి మాత్రం 84 రోజులు.  


రూ. 598 ప్రీపెయిడ్ ప్యాక్ ధరను రూ. 719కి పెంచింది. దీని కాలపరిమితి కూడా 84 రోజులే. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. రూ. 449 ప్రీపెయిడ్ ప్యాక్ ధరను రూ. 100 పెంచి రూ. 549 చేసింది. రూ. 379 ప్యాక్‌ను రూ. 455కి, రూ. 298 ప్యాక్ ధరను 359కి, రూ. 249 ప్యాక్‌ ధరను 299కి, రూ.219 ప్యాక్ ధరను రూ.265కి, రూ. 149 ప్యాక్ ధరను రూ. 179కి, రూ. 79 ప్యాక్ ధరను రూ. 99కి పెంచింది. అలాగే రూ. 48 డేటా ప్యాక్‌పై పది రూపాయలు, రూ.98 డేటా ప్యాక్‌పై రూ. 20, రూ.251 డేటా ప్యాక్‌పై రూ. 50 పెంచింది. 

 

Advertisement
Advertisement