ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో పూరి రథయాత్ర లైవ్

ABN , First Publish Date - 2020-06-30T21:07:25+05:30 IST

జులై ఒకటిన జరగనున్న పూరి జగన్నాథ రథయాత్రను భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన డిజిటల్ కంటెంట్, స్ట్రీమింగ్ యాప్

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో పూరి రథయాత్ర లైవ్

న్యూఢిల్లీ: జులై ఒకటిన జరగనున్న పూరి జగన్నాథ రథయాత్రను భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన డిజిటల్ కంటెంట్, స్ట్రీమింగ్ యాప్ ఎక్స్‌ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారతీయ ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులందరూ ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగానే వీక్షించవచ్చని తెలిపింది. 


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో రథయాత్రకు భక్తులు హాజరు కాకుండా గతవారం సుప్రీంకోర్టు నిషేధించింది. రథాన్ని లాగే వారి భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. 


ఈ నేపథ్యంలో రథయాత్రను భక్తులకు లైవ్‌లో అందించాలని భారతీ ఎయిర్‌టెల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా షెమారూ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్‌టెల్ ఖాతాదారులందరూ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఎక్స్‌ట్రీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Updated Date - 2020-06-30T21:07:25+05:30 IST