Oct 26 2021 @ 22:06PM

ఒకే ఫోటోలో DADDY, HUBBY... ఐశ్వర్య ధనుష్ స్పందన ఏంటంటే...

67వ జాతీయ అవార్డుల వేదికపై సోమవారం నాడు మామ రజనీకాంత్, అల్లుడు ధనుష్ ఒకేసారి వెలిగిపోయారు. వారిద్దరి ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఐశ్వర్య ధనుష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘దే ఆర్ మైన్... అండ్ దిస్ ఈజ్ హిస్టరీ’’ అంటూ కామెంట్ చేశారు. అంతే కాదు, ‘ప్రౌడ్ డాటర్, ప్రౌడ్ వైఫ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్స్ కూడా జత చేశారు. 


సాధారణంగా సినిమా వారికి ఒక్క జాతీయ అవార్డ్ లభిస్తేనే ఎంతో ఎగ్జైట్ అవుతారు. కానీ, ఈ సారి రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకి డబుల్ హ్యాపీనెస్ దక్కింది. ఆమె తండ్రి, సూపర్ స్టార్ రజనీ... దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం స్వంతం చేసుకున్నారు. ఇక ఐశ్వర్య భర్త, కోలీవుడ్ హీరో ధనుష్ కూడా... జాతీయ ఉత్తమ నటుడుగా సత్తా చాటారు. ఆయన నటించిన ‘అసురన్’ సినిమా నేషనల్ అవార్డ్స్‌లో సంచలనం సృష్టించింది. 



తండ్రికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, భర్తకి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కటంతో వారిద్దరు కలసి కెమెరాకి ఫోజిచ్చిన సూపర్ పిక్‌ని ఐశ్వర్య సొషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఇదొక చరిత్ర’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తాను కూతురిగా, భార్యగా గర్విస్తున్నానని అన్నారు...