Abn logo
May 21 2020 @ 14:20PM

ఐశ్వర్య సింప్లిసిటీ.. నెటిజన్ల ఫిదా!

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న `థ్రోబ్యాక్ ఫొటో` ఛాలెంజ్‌లో భాగంగా ఐశ్వర్యకు చెందిన ఈ ఫొటో వెలుగులోకి వచ్చింది. 


మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత ఐశ్వర్య ప్రవర్తించిన తీరు  నెటిజన్లను ఫిదా చేస్తోంది. తల మీద ప్రపంచ సుందరి కిరీటం ఉన్నప్పటికీ తన తల్లి బృందారాయ్‌తో కలిసి ఓ సాధారణ యువతిలా నేలపై కూర్చుని ఐశ్వర్య భోజనం చేస్తోంది. ఈ ఫొటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఐశ్వర్య అందగత్తె అని ప్రశంసిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement