Abn logo
Jul 17 2020 @ 21:48PM

నానావతి ఆసుపత్రికి ఐశ్వర్యారాయ్ తరలింపు

ముంబై: కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్న నటి ఐశ్వర్యారాయ్‌ను నానావతి ఆసుపత్రికి తరలించారు. ఆమెకు జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఆమె మామ అమితాబ్ బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్ నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారిద్దరూ కోలుకుంటున్నారని వైద్యుల ద్వారా తెలిసింది.


మరోవైపు హోం క్వారంటైన్‌లో ఉన్న ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య‌ను కూడా నానావతి ఆసుపత్రికి తరలించారని తెలిసింది. ఐశ్వర్యారాయ్ అత్త జయాబచ్చన్‌కు చేసిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని వైద్యులు గతంలోనే ప్రకటించారు. 

Advertisement
Advertisement
Advertisement