అజయ్‌మిశ్రాను తొలగించాలి

ABN , First Publish Date - 2021-10-14T06:55:00+05:30 IST

నలుగురు రైతులతోపాటు 8 మంది మృతిచెందిన లఖింపూర్‌ ఖేరి సంఘటనకు బాధ్యత వహి స్తూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాను తొలగించాలని ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

అజయ్‌మిశ్రాను తొలగించాలి

  • లఖింపూర్‌ ఖేరి ఘటనపై రాష్ట్రపతికి కాంగ్రెస్‌ వినతి
  • ప్రభుత్వంతో రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడతానన్నారు: ప్రియాంక

న్యూఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): నలుగురు రైతులతోపాటు 8 మంది మృతిచెందిన లఖింపూర్‌ ఖేరి సంఘటనకు బాధ్యత వహి స్తూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాను తొలగించాలని ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఘటనపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిల కమిషన్‌తో విచారణ జరిపించాలని బుధవారం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.


ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హామీ ఇచ్చారని ప్రియాంక గాంధీ చెప్పారు. లఖింపూర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలియజేస్తూ ఒక వినతిపత్రం అందజేశారు. ఈ కేసు లో ప్రధాన నిందితుడు ఆశి్‌ష మిశ్రా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌మిశ్రా కుమారుడైనందున.. ఆయన ఆ పదవిలో ఉండగా విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదన్నారు. కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాకు నిందితు డిగా ఉన్న ఒక హత్య కేసులోనూ నాలుగేళ్లు అయినా కోర్టు తీర్పు ఇప్పటికీ వెలువడలేదని గుర్తు చేశారు. 


లఖింపూర్‌ ఘటనను ఖండించిన నిర్మల

లఖింపూర్‌ ఖేరి ఘటనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఖండించారు.అయితే ఇలాంటి ఘటనలు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతుంటాయని, వాటినీ ప్రస్తావిం చాల్సి ఉందన్నారు. అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆమె హార్వార్డ్‌ కెనడీ స్కూల్‌లో మంగళవారం జరిగిన ఒక చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. 


ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ నిరాకరణ

ఆశిష్‌మిశ్రా, అతని అనుచరుడు ఆశిష్‌ పాండేల బెయిల్‌ దరఖాస్తులను లఖింపూర్‌ ఖేరి కోర్టు తిరస్కరించింది. 12 గంటల విచారణ తర్వాత సిట్‌ బృందం ఆశిష్‌ మిశ్రాను ఈ నెల 9న అరెస్టు చేసింది. పోలీసులు బుధవారం లవ్‌కుష్‌, అంకిత్‌దా్‌స, లతీఫ్‌ అలియాస్‌ కాలేలను అరెస్టు చేశారు. ఆశిష్‌మిశ్రాకు అత్యంత సన్నిహితుడైన అంకిత్‌దా్‌స మాజీ మంత్రి ఆశిష్‌దాస్‌ మేనల్లుడు. నలుగురు రైతులను ఢీకొట్టిన ఎస్‌యూవీ కారు అతని సొంతం అని చెబుతున్నారు.

Updated Date - 2021-10-14T06:55:00+05:30 IST