Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముంబైలో పుట్టి ముంబై గడ్డపై చరిత్ర సృష్టించిన కివీస్ బౌలర్ అజాజ్ పటేల్

ముంబై: న్యూజిలాండ్ పేసర్ అజాజ్ పటేల్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లఖించాడు. జన్మతః భారతీయుడైన అజాజ్ ముంబైలోనే పుట్టాడు. ఇప్పుడు అదే గడ్డపై తనపేరుపై ఘనమైన రికార్డును రాసుకున్నాడు. భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేలకూల్చి టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.


అజాజ్ కంటే ముందు ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్, టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. అజాజ్ ఇప్పుడు వారి సరసన నిలిచాడు. ఆట తొలి రోజైన నిన్న నాలుగు వికెట్లు సాధించిన అజాజ్.. రెండో రోజైన నేడు అదే ఫామ్‌ను కొనసాగించాడు. మిగతా ఆరుగురు ఇండియన్ బ్యాటర్లను పెవిలియన్ పంపి మొత్తంగా పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.  


మొత్తం 47.5 ఓవర్లు వేసిన అజాజ్ 119 పరుగులిచ్చి 10 వికెట్లు తీసుకున్నాడు. 1956లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఆ టెస్టులో లేకర్ మొత్తం 19 వికెట్లు పడగొట్టడం మరో విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో 53 పరుగులిచ్చి 10 వికెట్లు నేలకూల్చాడు.

 

భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం (ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం)లో పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో 74 పరుగులిచ్చి మొత్తం పది వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అజాజ్ పటేల్ మళ్లీ ఈ అరుదైన ఘనత సాధించాడు.


Advertisement
Advertisement