Advertisement
Advertisement
Abn logo
Advertisement

అజాజ్ పటేల్ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు

ముంబై: భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేల కూల్చి టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కిన అజాజ్.. నేడు మరో రికార్డు సృష్టించాడు.


రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్, పుజారా, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్‌లను పెవిలియన్ పంపాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 225 పరుగులిచ్చి 14 వికెట్లు తీశాడు.


ఫలితంగా ఒక టెస్టులో ఇండియాపై అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా మరో ఘనమైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లండ్ పేసర్ ఇయాన్ బోథమ్ పేరుపై ఉంది. 1980లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బోథమ్ 106 పరుగులిచ్చి 13 వికెట్లు నేలకూల్చాడు. భారత్‌పై ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును పటేల్ బద్దలుగొట్టాడు.


భారత్‌పై ఒక టెస్టులో 12 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో పాకిస్థాన్‌ ఆటగాడు ఫజల్ మహమూద్, పేసర్ ఆండీ రాబర్ట్స్, అలన్ డేవిడ్‌సన్, బ్రూస్ రీడ్, అలన్ డొనాల్డ్, జెఫ్ డైమోక్ ఉన్నారు.   

Advertisement
Advertisement