May 14 2021 @ 15:37PM

కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అజిత్ రూ. 25 లక్షల విరాళం

కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అజిత్ రూ. 25 లక్షల విరాళం అందించారు. గత ఏడాది కంటే కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లెక్కకు మించి పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు మృతుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కోవిడ్ బారిన పడుతున్న వారికి హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరక ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. దాంతో సినీ, రాయకీయ నాయకులు సహా ఎంతో మంది తమకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నారు. కొందరు సినీ తారలు విరాళాలు అందచేస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం అందచేసి బాధితులకు అండగా నిలిచారు.