Jul 23 2021 @ 21:29PM

అజిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అజిత్ 61’ అప్‌డేట్

స్టార్‌ హీరో అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపుగా పూర్తికాగా, ప్యాచ్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ను ఇటీవలే రిలీజ్‌ చేయగా మంచి స్పందన వచ్చింది. అదేసమయంలో ఈ మూవీని దసరా లేదా దీపావళి సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, ‘వలిమై’ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే ఈ చిత్రం విడుదల తేదీ అధికారికంగా ప్రకటించాలని చిత్రయూనిట్‌ భావిస్తుంది. ఇదిలావుంటే అజిత్‌ నటించే 61వ చిత్రాన్ని కూడా హెచ్‌. వినోదే తెరకెక్కించనున్నారు. 


దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇందులో అజిత్‌ సరసన నటించే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత అజిత్‌ నటించే 61వ చిత్రం షూటింగ్‌ ‘వలిమై’ విడుదలకు ముందే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అన్నీ అనుకూలిస్తే అక్టోబరు నుంచి ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కావచ్చు. అదేసమయంలో ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనుండగా, యువన్‌ శంకర్‌ రాజా మరోమారు సంగీతం సమకూర్చనున్నారు. యాక్షన్‌ డ్రామా హై ఎమోషన్స్‌ కథాంశంతో ఈ మూవీని రూపొందనుంది.