Jul 22 2021 @ 19:20PM

అజిత్‌ భార్య షాలిని రీ ఎంట్రీ నిజమేనా?

కోలీవుడ్‌ అగ్ర నటుడు తల అజిత్‌ సతీమణి షాలిని బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత హీరో విజయ్‌ నటించిన ‘కాదలుక్కు మరియాదై’ అనే చిత్రంతో హీరోయిన్‌గా మారింది. హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న షాలిని ఆ తర్వాత హీరో అజిత్‌తో కలిసి ‘అమర్కలం’ అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే అజిత్‌, షాలిని ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత షాలిని వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. కాగా ఇపుడు అంటే దాదాపు 20 యేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. దర్శక దిగ్గజం మణిరత్నం ప్రఖ్యాత నవల ‘కల్కి’ ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో అనేక మంది స్టార్‌ హీరో హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో షాలిని ప్రత్యేక పాత్రలో కనిపించనున్నదనే వార్త ఇపుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Otherwoodsమరిన్ని...