Advertisement

నా పేరు ముందు ‘తల’ తీసేయండి : అజిత్

సూపర్ స్టార్ అజిత్ కు తమిళనాట ఏ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో తన క్రేజ్ ను క్రమంగా పెంచుకొని అభిమాన గణాన్ని భారీగా పెంచుకున్నారు. ఆయన సినిమా విడుదలవుతోందనగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది. తన అభిమాన హీరో కోసం సమాజ సేవ చేస్తూ.. ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టే కార్యక్రమాల్ని చేపడుతుంటారు అభిమానులు. అజిత్ కు కూడా తన ఫ్యాన్స్ పట్ల అంతే అభిమానముంది. అయితే అభిమానుల చేత ‘తల’ అని పిలిపించుకోవడం మాత్రం ఆయనకి ఇష్టంలేదు. ఆ విషయాన్ని మీడియాకి, తన ఫ్యాన్స్ కి అఫీషియల్ గా తెలియచేశారు అజిత్.


‘గౌరవనీయులైన మీడియా ప్రతినిధులకి, ప్రేక్షకులకి, నా అసలైన అభిమానలకి.. నేను అజిత్, అజిత్ కుమార్ లేక ఏకే అని పిలిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. ‘తల’ అని కాదు. నా పేరు ముందు ఇంకేవిధమైన ప్రిఫిక్స్ లేదు. మీరెప్పుడూ ఆరోగ్యంగానూ, సంతోషంగానూ ఉండాలని, అందమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’... అంటూ అజిత్ తెలిపారు. 

Advertisement