Abn logo
May 16 2020 @ 13:41PM

వ‌చ్చే ఏడాదికి వెళ్లిన అజిత్‌

అగ్రనటుడు అజిత్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘వలిమై’. యువ దర్శకుడు హెచ్‌.వినోద్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో కానీ 2021 ఆరంభంలో విడుదల చేసేలా దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేశారట. అయితే సినిమా కోసం పనిచేసే ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత చాలా ముఖ్యమని, అందువల్ల కరోనా ప్రభావం పూర్తిగా తొలిగిపోయే వ‌ర‌కు ఆగుదామని అజిత్‌ సూచించినట్లు కోలీవుడ్‌ సమాచారం. దీంతో ‘వలిమై’ వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement