Abn logo
Jun 4 2020 @ 17:24PM

పెళ్లైనా ఆ కాంక్ష తిరలేదట!

ఇప్పటి కథనాయికలు పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను చక్కగా మలుచుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినదే ఆకాంక్ష సింగ్. బుల్లితెరపై పలు థారావాహికల్లో మెరిసిన ఈ అమ్మడు బాలీవుడ్‌లో బద్రీనాథ్‌ దుల్హానియాతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో సపోర్టింగ్ రోల్‌కే పరిమితమైన ఆకాంక్షను హీరోయిన్‌గా మార్చిన చిత్రం ‘మళ్లీరావా’. 


సుమంత్ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘మళ్లీరావా’ చిత్రం ఆకాంక్షకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా విజయంతోనే నాగార్జున, నాని ‘దేవదాస్‌’లో ఆఫర్ అందుకుంది. అయితే దేవదాస్ ప్లాప్‌తో ఈ జైపూర్ బ్యూటీకి తెలుగులో అవకాశాలు కరవయ్యాయి. దాంతో ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టిందట ఈ ముద్దుగుమ్మ. 


కన్నడలో ఇప్పటికే సుదీప్ సరసన పహిల్వాన్ సినిమాలో కథానాయికగా నటించింది. అయితే పలు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. పహిల్వాన్ ఫ్లాప్ అయినా ఇప్పుడు కన్నడలో కొన్ని క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటుందట ఆకాంక్ష. శాండిల్‌వుడ్‌లో సీనియర్ హీరోలకు ఈ అమ్మడు ఆకర్షణగా మారుతుందట. మరోవైపు ఆదిపినిశెట్టి నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తం మీద మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ రాజస్థానీ భామకు కన్నడ ఇండస్ట్రీ ఎలాంటి హిట్స్ ఇస్తుందో చూడాలి. 


Advertisement
Advertisement
Advertisement