ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ ఆత్మకథ `సింప్లి ఫ్లై` ఆధారంగా తెరకెక్కిన చిత్రం `ఆకాశం నీ హద్దురా`. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. సూర్య నటనకు, సుధా కొంగర దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయ్యారు.
తాజాగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచినట్టు సమాచారం. ఉత్తమ నటుడు, ఉత్తమ నటితోపాటు పలు విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి థియేటర్లలో విడుదలైన సినిమాలనే ఆస్కార్ అవార్డుల కోసం పరిశీలిస్తారు. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఈసారి ఓటీటీల్లో విడుదలైన సినిమాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు.