Abn logo
Jun 7 2020 @ 12:41PM

స్వాతంత్య్రదినోత్సవ సంద‌ర్భంగా ‘ఆకాశ‌ం నీ హ‌ద్దురా’

హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంట గా నటిస్తున్న తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశ‌ం నీ హ‌ద్దురా’ పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మోహన్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టించారు. జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ లేదా మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక నిషేధాజ్ఞల కారణంగా వాయిదా పడింది. ఇటీవల సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రానికి ‘యు’ సర్టిఫికెట్‌ లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement