దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ కంపెనీ బైజూస్ మరో భారీ టేకోవర్‌కు సిద్ధమైంది. ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చే ఆకాశ్ ఇనిస్టిట్యూట్స్‌ను 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7,400 కోట్లు) కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం.
రెండు మూడు నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే రెండు కంపెనీలు అధికారికంగా ఇంకా నోరు విప్పలేదు.