అక్బర్‌-బీర్బల్‌ కల!

ABN , First Publish Date - 2020-09-24T06:29:19+05:30 IST

ఒకరోజు సభికులతో సభా ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. అక్బర్‌ సభలోకి అడుగుపెట్టడంతోనే అంతటా నిశ్శబ్దం నెలకొంది.

అక్బర్‌-బీర్బల్‌ కల!

ఒకరోజు సభికులతో సభా ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. అక్బర్‌ సభలోకి అడుగుపెట్టడంతోనే అంతటా నిశ్శబ్దం నెలకొంది. సభలో ఆసీనుడైన అక్బర్‌ ‘‘రాత్రి నాకు ఒక కల వచ్చింది’’ అని అనడంతో అందరూ ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు. ‘‘ఆ కలలో నేనూ, బీర్బల్‌ చీకటిలో నడుచుకుంటూ వెళుతున్నాం. దారి కనిపించక ఇద్దరం కింద పడిపోయాం.


నేను పాయసం సముద్రంలో పడ్డాను. బీర్బల్‌ ఎందులో పడిపోయాడో తెలుసా?’’ అని ఆగిపోయాడు అక్బర్‌. ‘‘ఎందులో పడిపోయాడో మీరే చెప్పండి జహాపనా!’’ అని కుతూహులంగా అడిగారు అంతా. ‘‘అక్బర్‌ బురద గుంటలో పడ్డాడు’’ అన్నాడు. అంతే... ఒక్కసారిగా అందరూ  నవ్వారు. అప్పుడు బీర్బల్‌ ‘‘జహాపనా! నాకూ అలాంటి కలే వచ్చింది. అయితే ఆ కల పూర్తి అయ్యే వరకు నిద్రలోనే ఉన్నాను. మీరు పాయసంలో నుంచి, నేను బురద గుంటలో నుంచి బయటకు వచ్చాను. ఒళ్లు శుభ్రం చేసుకుందామని నీళ్ల కోసం వెతికాం. కానీ అక్కడ చుక్క నీరు కూడా లేదు. అప్పుడు ఏం చేశామో తెలుసా? అన్నాడు. అక్బర్‌ ‘‘ఏం చేశాం బీర్బల్‌’’ అని అడిగాడు ఆశ్చర్యంగా! ‘‘నీళ్లు లేకపోయే సరికి ఇద్దరం ఒకరి ఒంటిని ఒకరం నాకుతూ శుభ్రం చేసుకున్నాం’’ అని చెప్పాడు. అక్బర్‌ అప్పటి నుంచీ ఇంకోసారి బీర్బల్‌ని తక్కువ చేసి మాట్లాడకూడదని అనుకున్నాడు.

Updated Date - 2020-09-24T06:29:19+05:30 IST