దగ్గరి దారి!

ABN , First Publish Date - 2020-11-08T05:30:06+05:30 IST

అక్బర్‌ ఓసారి తన అనుచరులతో కలిసి దూర ప్రయాణం మొదలుపెట్టాడు. ఎండలు మండిపోతుండటంతో ప్రయాణంలో బాగా అలసిపోయాడు. ఎంతకీ గమ్యం రాకపోతుండటంతో అక్బర్‌ను పిలిచి ‘‘నాకోసం దూరాన్ని తగ్గించగలవా?’’ అని అడిగాడు....

దగ్గరి దారి!

అక్బర్‌ ఓసారి తన అనుచరులతో కలిసి దూర ప్రయాణం మొదలుపెట్టాడు. ఎండలు మండిపోతుండటంతో ప్రయాణంలో బాగా అలసిపోయాడు. ఎంతకీ గమ్యం రాకపోతుండటంతో అక్బర్‌ను పిలిచి ‘‘నాకోసం దూరాన్ని తగ్గించగలవా?’’ అని అడిగాడు. అందుకు బీర్బల్‌ ‘‘సరే జహాపనా!’’ అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విన్న అందరూ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గమ్యం చేరడానికి వాళ్లకు ఉన్న దారి అదొక్కటే. అలాంటప్పుడు దూరం ఎలా తగ్గుతుంది అని అందరూ ఆశ్చర్యపోయారు.


‘‘నాకోసం దూరం తగ్గిస్తానని అంటున్నావు కదా! తగ్గించు!’’ అని అడిగాడు అక్బర్‌. వెంటనే ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు బీర్బల్‌. కథ ఆసక్తికరంగా ఉండటంతో అందరూ లీనమై వినసాగారు. ఇంతలో వాళ్లు చేరుకున్న గమ్యం వచ్చేసింది. కథలో పడి ప్రయాణ సమయాన్ని అక్బర్‌ మరిచిపోయాడు. ‘‘బీర్బల్‌ మనం చాలా త్వరగా వచ్చేసాం’’ అన్నాడు అక్బర్‌. ‘‘దూరాన్ని తగ్గించడమంటే ఇదే జహాపనా!’’ అని అన్నాడు బీర్బల్‌.

Updated Date - 2020-11-08T05:30:06+05:30 IST