నాసిరకంగా రోడ్డు నిర్మించారని గ్రామస్థుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-08T10:37:51+05:30 IST

ఆకెనపల్లి గ్రామంలో రూ. 2 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు నాసిరకంగా ఉందని, పది రోజుల ..

నాసిరకంగా రోడ్డు నిర్మించారని గ్రామస్థుల ఆందోళన

బెల్లంపల్లి టౌన్‌, జూలై 7: ఆకెనపల్లి గ్రామంలో రూ. 2 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు నాసిరకంగా ఉందని,  పది రోజుల క్రితమే రోడ్డు వేసినప్పటికీ నాణ్యత లేక   పగులుతుందని గ్రామస్థులు నిరసన తెలిపారు. రాచకొండ గోవర్ధన్‌రావు, మోహన్‌ రెడ్డి, కొళ్లూరి విష్ణు, జాడి మహేష్‌, తోకల ముత్యాలు, పర్వతాలు మాట్లాడారు. ప్రభుత్వం 2019-20లో రెండుకోట్ల రూపాయల డీఎంఎఫ్‌టీ నిధులతో 4.30 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గుత్తేదారు నాసిరకంగా నిర్మించడంతో రోడ్డు కుంగిపోవడం, పగుల్లు తేలుతోందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారు ల నిర్లక్ష్యం మూలంగా రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని వారు ఆరో పించారు. ఉన్నతాధికారులు పరిశీలించి నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకోవాల ని డిమాండ్‌ చేశారు. పోలాంపల్లి విజయ్‌, ముఖేష్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T10:37:51+05:30 IST