Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘అఖండ’ సినిమా సంబురాలు

సూర్యాపేటరూరల్‌ / హుజూర్‌నగర్‌, డిసెంబరు 2: సినీ హీరో నంద మూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలైన సందర్భంగా మండలంలో తాళ్లఖమ్మంపహాడ్‌లో అభిమానులు సంబురాలు నిర్వహించారు. అనంతరం సూర్యాపేటలో సినిమా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి తండ్రి కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీడి భిక్షం, టీడీపీ మండల అధ్యక్షుడు తౌడోజు వీరాచారి, ఏఎంసీ డైరెక్టర్‌ రమణారెడ్డి, వాంకుడోతు నాగరాజు,  కొండపల్లి దిలీ్‌పరెడ్డి, ప్రేమ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌లోని సాయిబాబా థియేటర్‌లో అఖండ సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు వెంకటేశ్వర్లుగౌడ్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌.కె అలీ, సైదులు, అంజయ్య, రవి, నాగరాజు, సుబ్రమణ్యం, కృష్ణ, రాంబాబు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement