Apr 21 2021 @ 19:38PM

సంచలనం సృష్ఠిస్తున్న 'అఖండ' టీజ‌ర్..!

'సింహా', 'లెజెండ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ సృష్ఠిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి  అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఉగాది కానుక‌గా 'అఖండ' అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ 31మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ టీజ‌ర్ సృష్టించిన సెన్సేష‌న్‌తో ప్రేక్ష‌కాభిమానుల్లో 'అఖండ' మూవీపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌గా పెరిగాయి. ఏప్రిల్ 30 వ‌ర‌కూ నాన్‌స్టాప్‌గా జ‌రిగే షెడ్యూల్‌తో దాదాపుగా షూటింగ్ పూర్త‌వుతుంది. కాగా ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా ప్ర‌గ్యా జైస్వాల్‌ నటిస్తోంది. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ గనక లేకపోతే చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విడుదల తేదీ మే 28 మిస్ కాకుండా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.