Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 20:17PM

మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి

లక్నో: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ సోమవారంనాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన భౌతికకాయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో కనుగొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. 5 పేజీల సూసైడ్ నోట్‌ను కూడా కనుగొన్నారు. తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి ఇందుకు బాధ్యుడుగా మహంత్ నరేంద్ర గిరి అందులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృదంతో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది.

ప్రధాని మోదీ సంతాపం

కాగా, మహంత్ నరేంద్ర గిరి ఇక లేరనే వార్త విషాదం నింపినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో సంతాపం తెలిపారు. మహంత్ నరేంద్ర గిరి మృతిపై ముందుగా స్పందించిన వారిలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. నరేంద్ర గిరి స్వామీజీ మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి, ఆయన శిష్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, మమంత్ నరేంద్ర గిరి ఈ ఏడాది జూలైలో కరోనా పాజిటివ్‌తో రిషీకేష్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. స్వస్థత చేకూరిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement