Abn logo
Apr 9 2021 @ 00:49AM

ఏజెంట్‌గా అఖిల్‌

అఖిల్‌ అక్కినేని హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘ఏజెంట్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సరేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. గతంలో సురేందర్‌ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ‘కిక్‌’, ‘రేసుగుర్రం’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో అఖిల్‌ మేకోవర్‌ పూర్తిగా కొత్తగా ఉంది. అఖిల్‌ స్టైల్‌లో సురేందర్‌రెడ్డి మార్క్‌ కనిపిస్తుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అఖిల్‌ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ నెల 11న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌,  సినిమాటోగ్రఫీ: రాగూల్‌ హెరియన్‌ ధారుమాన్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా. 

అలాగే అఖిల్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో స్టైలిష్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్‌ 19న విడుదల చేయనున్నారు. 


Advertisement
Advertisement
Advertisement