Jul 19 2021 @ 10:27AM

హను రాఘవపూడితో అఖిల్ ..?

హను రాఘవపూడితో అక్కినేని అఖిల్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని నెట్టింట వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సినిమాలో నటించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. జీఏ2 బ్యార్‌లో బన్నీవాసు నిర్మించారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా అఖిల్ హీరోగా సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించేవరకు ఆగాల్సిందే.