అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-01-16T21:10:27+05:30 IST

సికింద్రాబాద్‌ కోర్టులో మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్‌ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు

అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కోర్టులో మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్‌ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినా.. బెయిల్‌ దొరకలేదు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అఖిలకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అఖిలప్రియ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టులను కూడా కోర్టుకు సమర్పించారు. అయితే బెయిల్ పిటిషన్‌పై పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 


బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఆమె పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. తనకు బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ రెండోసారి కోర్టును ఆశ్రయించారు. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వాలా లేదా అనే దానిపై సోమవారం పూర్తిస్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ2గా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు ప్రధాన నిందితురాలిగా మార్చారు. ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు. ముందుగా అఖిలప్రియపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత మరో రెండు సెక్షన్లు (ఐపీసీ 147, 385) జోడించారు. 

Updated Date - 2021-01-16T21:10:27+05:30 IST