బీజేపీకి ధన్యవాదాలు: అఖిలేష్ యాదవ్

ABN , First Publish Date - 2022-01-23T22:20:39+05:30 IST

ముందుగా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని వారస్తత్వ రాజకీయ నాయకులని, మా పార్టీని వారసత్వ రాజకీయ పార్టీయని విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు వారసత్వమే లేకుండా మా నేత్ని బీజేపీలోకి తీసుకుంటున్నారు. మా వారసత్వాన్ని అంతం చేస్తున్నారు..

బీజేపీకి ధన్యవాదాలు: అఖిలేష్ యాదవ్

లఖ్‌నవూ: తమ కుటుంబ సభ్యుల్ని చేర్చుకున్నందుకు భారతీయ జనతా పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కృతజ్ణతలు తెలిపారు. కుటుంబ పార్టీలని తమను విమర్శించే వారు ఆ మరకల్ని తుడిపేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో ‘‘ఒక వైపేమో బీజేపీ నేతలు ఎస్పీవైపుకు వస్తుంటే మరోవైపేమో ములాయం కుటుంబ సభ్యులు ఎస్పీ నుంచి బీజేపీ వైపుకు వెళ్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ్‌వాదీ పార్టీలో ఆయారాం.. గయారాం రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. వీటిని మీరెలా మేనేజ్ చేస్తున్నారు?’’ అని అఖిలేష్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు.


దీనికి అఖిలేష్ స్పందిస్తూ ‘‘ముందుగా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని వారస్తత్వ రాజకీయ నాయకులని, మా పార్టీని వారసత్వ రాజకీయ పార్టీయని విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు వారసత్వమే లేకుండా మా నేత్ని బీజేపీలోకి తీసుకుంటున్నారు. మా వారసత్వాన్ని అంతం చేస్తున్నారు. అపర్ణను బీజేపీలోకి తీసుకొని మంచి పని చేశారు. నిజానికి సమాజ్‌వాదీ పార్టీ ఆలోచనా విధానం ఇప్పుడు మరింత బలపడింది. సమాజ్‌వాదీ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ విలువల్ని కాపాడుతుంది’’ అని అన్నారు.

Updated Date - 2022-01-23T22:20:39+05:30 IST