Akhilesh Yadav భార్య డింపుల్, కుమార్తెలకు కొవిడ్

ABN , First Publish Date - 2021-12-23T13:00:10+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆయన కుమార్తెలకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది....

Akhilesh Yadav భార్య డింపుల్, కుమార్తెలకు కొవిడ్

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆయన కుమార్తెలకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ‘‘రెండు డోసుల కొవిడ్ టీకా వేసుకున్న నాకు కరోనా సోకింది, ఎలాంటి లక్షణాలు లేకున్నా నా భద్రత కోసం ఐసోలేషన్ లో ఉన్నాను, నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’అంటూ డింపుల్ యాదవ్ ట్వీట్ చేశారు. తన భార్య డింపుల్ కు కరోనా సోకడంతో అఖిలేష్ యాదవ్ కూడా కరోనా పరీక్ష చేయించుకోగా, అతనికి కొవిడ్ నెగిటివ్ అని వచ్చింది. డింపుల్ యాదవ్, ఆమె కుమార్తెకు కరోనా సోకడంతో వారిద్దరూ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డింపుల్ యాదవ్ కు కరోనా సోకడంతో ఎన్నికల ప్రచార పర్వానికి ఆటంకం కలిగినట్లయింది. 


Updated Date - 2021-12-23T13:00:10+05:30 IST