Akhilesh yadav : చిన్న పార్టీలతో పొత్తుకు రెడీ

ABN , First Publish Date - 2021-08-01T22:07:40+05:30 IST

వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోడానికి తాము సిద్ధంగానే ఉన్నామని మాజీ సీఎం, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్

Akhilesh yadav : చిన్న పార్టీలతో పొత్తుకు రెడీ

లక్నో :  వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోడానికి తాము సిద్ధంగానే ఉన్నామని మాజీ సీఎం, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. బీజేపీని ఓడించడానికి భావసారుప్యత ఉన్న పార్టీలందరితో పొత్తు పెట్టుకోడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్, మాయావతి ఎవరి వైపు ఉంటారో వారే తేల్చుకోవాలని అన్నారు. అయితే మహాఘట్ బంధన్ ఏర్పర్చి, ఎన్నికలకు వెళ్తారా? అని ప్రశ్నించగా.... చిన్న పార్టీలు మొదటి నుంచీ తమతోనే ఉన్నాయని, తమతోనే కలిసి వస్తాయని అఖిలేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-08-01T22:07:40+05:30 IST