Abn logo
Aug 4 2020 @ 23:05PM

కౌబాయ్ గెటప్‌లో ఉన్న అఖిల్ చిన్నప్పటి ఫొటో వైరల్

అక్కినేని అఖిల్ తన చిన్నప్పుడు ‘సిసింద్రీ’ అనే చిత్రంతోనే అందరినీ అలరించాడు. ఆ చిత్రం ఇప్పటికీ అందరినీ అలరిస్తుంది. నిజంగా అఖిల్‌తో ఆ సినిమా చేయడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత అఖిల్ చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నా.. అంతగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. తాజాగా అఖిల్ కౌబాయ్ గెటప్‌లో ఉన్న ఫొటో మాత్రం వైరల్ అవుతుంది. కారణం ఏమిటో తెలుసా?


ఈ ఫొటో మహేష్ బాబు నటించిన ‘టక్కరిదొంగ’ చిత్ర లోకేషన్‌లో తీసిన ఫొటో. ఈ ఫొటోలో కౌబాయ్ గెటప్‌లో అఖిల్ చేతిలో గన్ను, తల మీద హ్యాట్ పెట్టుకుని బుల్లి కౌబాయ్‌లా అఖిల్ ఆకట్టుకుంటున్నాడు. ‘టక్కరిదొంగ’ షూటింగ్ టైమ్‌లో అఖిల్ ఆ సినిమా సెట్‌కి వెళ్లాడట. అంతే అక్కడ దర్శకుడు జయంత్ సి పరాన్జీ అఖిల్‌ని ఇలా తయారు చేయించి ఫొటో తీయించాడట. అప్పటికే జయంత్ సి పరాన్జీతో నాగార్జున ‘రావోయి చందమామ’ అనే చిత్రం చేసి ఉన్నారు. ఆ పరిచయంతోనే అఖిల్‌ని ఇలా కౌబాయ్‌గా మార్చాడని అనుకుంటున్నారు. అయితే ఈ పిక్ చూసిన తర్వాత ఇప్పుడు అఖిల్ ఇలాంటి గెటప్‌లో ఓ సినిమా చేస్తే బాగుంటుందని.. అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement