Abn logo
Sep 28 2020 @ 15:25PM

సమంతకు అక్కినేని ఫ్యామిలీ విషెస్!

Kaakateeya

ఒకవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ.. వీటితోపాటు బిజినెస్‌పైన కూడా దృష్టి సారించింది ప్రముఖ కథానాయిక సమంత. తన స్నేహితులతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓ ప్రీ స్కూల్‌ను స్టార్ట్ చేసింది. మరోవైపు వస్త్ర వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. సమంత అక్కినేని అనే తన పేరు కలిసొచ్చేలా `సాకీ` పేరుతో మహిళల బ్రాండెడ్ ఫ్యాషన్ వస్త్రాలను లాంచ్ చేసింది. దీనిని సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రమోట్ చేస్తోంది. 


ఈ రోజు ఉదయం 9: 35 గంటలకు ఈ బ్రాండ్‌ను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులు సమంతకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. సమంత భర్త నాగచైతన్య, మామ నాగార్జున, అఖిల్ అక్కినేని, `విక్టరీ` వెంకటేష్ తదితరులు ట్విటర్ ద్వారా సమంతకు శుభాకాంక్షలు చెప్పారు. 






Advertisement
Advertisement
Advertisement