Abn logo
Nov 22 2020 @ 22:45PM

యువసామ్రాట్‌.. వివాదాలకు తావులేని హీరో

Kaakateeya

కింగ్‌ నాగార్జున వారసుడిగా తెరంగేట్రం చేసిన యువసామ్రాట్‌ నాగచైతన్య.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకున్నారు. హీరోగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాగచైతన్య పుట్టినరోజు నవంబర్‌ 23. ఈ పుట్టినరోజుతో 34వ వసంతంలోకి అడుగుపెడుతున్న నాగచైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.


చూడడానికి చాలా కామ్‌గా కనిపిస్తాడు కానీ.. చాలా కామ్‌గానే తన ప్రేమ వ్యవహారం నడిపి.. చివరికి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అక్కినేని వారసుడు. మొదటి చిత్రం 'జోష్‌'తో జోష్‌ చూపించాలని తన సైడ్‌ ఎటువంటి లోపం లేకుండా చేసినా.. ఆ సినిమా అతనికి జోష్‌ నింపలేదు. ఇక రెండో సినిమాతో ఆయన సినిమా కెరీరే కాదు.. లైఫ్‌ కెరీర్‌ కూడా మారిపోయింది. ఏ మాయ చేశావే చిత్రంతో హిట్‌ని, జీవిత పార్ట్‌నర్‌ని సెట్‌ చేసుకున్నాడు చైతూ. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో 100 పర్సంట్‌ లవ్‌ అంటూ.. మంచి హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేసి.. ఆశించిన విజయాలు అందుకోలేకపోయాడు. అయితేనేం అంత సామాన్యంగా ఎవరికీ అందని గొప్ప అవకాశాన్ని చైతూ అందిపుచ్చుకున్నాడు. తన ఫ్యామిలీ లెజండ్‌ అయిన అక్కినేని నాగేశ్వరరావుతో, తండ్రి నాగార్జునతో, సోదరుడు అఖిల్‌తో కలిసి నటించే అవకాశం చైతూని వరించింది. 'మనం' చిత్రంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు చైతూ. అక్కడి నుంచి నాన్‌స్టాప్‌గా చిత్రాలు చేస్తున్న చైతూ.. జయపయాజయాలు పక్కన పెట్టి.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే పాత్రలను ఎన్నింటినో చేశారు. 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'శైలజా రెడ్డి అల్లుడు', 'మజిలి', 'వెంకీ మామ' వంటి చిత్రాలతో అలరిస్తూ.. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా వెలుతున్న నాగచైతన్య ప్రస్తుతం సెన్సిబుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ములతో  'లవ్‌ స్టోరీ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఆయనకి మెమెరబుల్‌ విజయాన్ని అందివ్వాలని, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులని అలరించాలని కోరుకుందాం.


Advertisement
Advertisement