Abn logo
Feb 24 2021 @ 23:15PM

రేపు అక్కురాడ పేపర్‌ మిల్లు బహిరంగ వేలం


 జలుమూరు, ఫిబ్రవరి 24: అక్కురాడ బయోగ్రీన్‌ పేపర్‌ మిల్లును ఈనెల 26న (శుక్రవారం) బహిరంగ వేలం  వేస్తున్నట్లు నరసన్నపేట వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కింజరాపు వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అక్కురాడ ఫ్యాక్టరీ వద్ద జలుమూరు తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద నోటీసులు అంటించామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తమ శాఖకు రూ.1.46 కోట్లు బకాయిపడి సకాలంలో చెల్లించనందున వారి అధీనంలో ఉన్న  భూములు వేలం వేస్తున్నట్లు  పేర్కొన్నారు. 

 

Advertisement
Advertisement
Advertisement