రహదారి ఆక్రమణలపై కొరడా

ABN , First Publish Date - 2021-02-25T04:15:55+05:30 IST

రహదారి ఆక్రమణలపై మున్సి పల్‌ అధికారులు కొరడా ఝళిపించారు

రహదారి ఆక్రమణలపై కొరడా
ఆక్రమణలను తొలగిస్తున్న మున్సిపల్‌ అధికారులు

-నిర్మాణాలను తొలగించిన మంచిర్యాల మున్సిపల్‌ అధికారులు

మంచిర్యాల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రహదారి ఆక్రమణలపై మున్సి పల్‌ అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యా లయం, నీళ్ల ట్యాంకు సమీపంలోగల మున్సిపల్‌ గదుల ఎదుట వెలిసిన అక్రమ నిర్మాణాలను కమిషనర్‌ స్వరూపారాణి నేతృత్వంలో బుధవారం ఎక్సకవేటర్‌ సహాయంతో తొలగించారు. పట్టణ ప్రణాళిక అధికారి సత్యనా రాయణ, టీపీఎస్‌ యశ్వంత్‌కుమార్‌, ఇతర సిబ్బంది ఆక్రమణ తొలగింపులో నిమగ్నమయ్యారు. హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల ముందు ఇష్టారీ తిన నిర్మాణాలు వెలవడంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమనించిన అఽధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

తొలగింపు కొనసాగేనా?

రహదారి ఆక్రమణలను మున్సిపల్‌ అధికారులు తొలగించడం శుభపరిణామమే అయినా పనులు ముందుకు సాగుతాయా అనే సందేహాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. గతంలో పలుమార్లు రహదారులు, డ్రెయీనేజీలను ఆనుకొని వెలసిన అక్రమ కట్టడాలు, బహుళ అంతస్థుల భవనాల మెట్లను సైతం మున్సిపల్‌ అధికారులు తొలగించారు. ఆక్రమణలు తొలగింపు ప్రారంభం కాగానే ప్రజా ప్రతినిధుల నుంచి అఽధికారులపై ఒత్తిళ్లు రావడంతో అర్ధాంతరంగా పనులు నిలిపివేసిన సంఘటనలు జిల్లా కేంద్రంలో కోకొల్లలు ఉన్నాయి. పోలీసుల రక్షణలో చేపట్టిన అక్రమణల తొలగింపు పనులు మధ్యలోనే నిలిచిపోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా తొల గిం పు పనులకు శ్రీకారం చుట్టడంతో ప్రజల కష్టాలు తొలగిపోనున్నాయి. 

నోటీసులు జారీ చేస్తున్నాం..

- స్వరూపారాణి, మున్సిపల్‌ కమిషనర్‌

రహదారుల ఆక్రమణలు తొలగించే పనిని కొనసాగిస్తాం. ఇందులో భాగం గా మొదట మున్సిపల్‌ గదుల ముందు వెలిసిన నిర్మాణాలను తొలగిస్తు న్నాం. పట్టణ ప్రజలు సహకరించాలి. రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమించి చేపట్టిన వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలి. లేనిపక్షంలో మున్సిపాలిటీ తరుపున తొలగిస్తాం.

Updated Date - 2021-02-25T04:15:55+05:30 IST