Oct 14 2021 @ 21:59PM

అక్షయ్ ఆమెని సోడాతో ముఖం కడుక్కోమన్నాడట! ఎందుకంటే...

యాక్టర్స్ జీవితాలు మనం అనుకున్నంత కూల్‌గా, హ్యాపీగా ఉండవు. వారికి కూడా బోలెడంత బర్డెన్ ఉంటుంది. ఇప్పుడు కాస్త పరిస్థితులు మారాయి కానీ ఒకప్పుడు నటీనటుల షెడ్యూల్స్ చాలా ఒత్తిడితో కూడుకుని ఉండేవి. ముఖ్యంగా, 90లలో బాలీవుడ్ స్టార్స్ డబుల్ షిఫ్టులు చాలా వరకూ చేస్తుండేవారు. అప్పటి వారి రెమ్యూనరేషన్స్ ఇప్పటి వాళ్లలా కోట్లలో ఉండేవి కాదు. అందుకే, ఒకేసారి రెండు, మూడు సినిమాలు సైన్ చేసేవారు. ఉదయం ఒక షూటింగ్, మధ్యాహ్నం మరోకటి, రాత్రి వేళ ఇంకో చిత్రం కానిచ్చేసే వారు. మరి అప్పుడు కెమెరా ముందు నిద్ర ముఖంతో కనిపించవద్దంటే ఎలా? ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ ఆయేషా జుల్కాకి ఓ అనూహ్యమైన ఐడియా చెప్పాడట!

1990లలో ఆయేషా జుల్కా బాలీవుడ్‌లో బిజీ స్టార్. పైగా అక్షయ్‌తో ఆమెది హాట్ పెయిర్. ‘ఖిలాడీ’ సినిమా వీరిద్దరిదే! అక్కీ కెరీర్‌లో ‘ఖిలాడీ’ మైల్‌స్టోన్ అనవచ్చు. కాకపోతే, ఆయేషా జుల్కా అప్పట్లో బిజీగా ఉండటంతో ఓ వైపు ‘ఖిలాడీ’ చేస్తూనే ‘బల్మా’ అనే మరో సినిమా కూడా ఒప్పుకుంది. దాంతో ఆ మూవీకి నైట్ షూట్ చేయాల్సి వచ్చేదట. ఉదయం అక్షయ్‌తో ‘ఖిలాడీ’ పూర్తి చేసి పెద్దగా రెస్ట్ తీసుకోకుండానే రాత్రి వేళ ఆమె ‘బల్మా’ షూటింగ్‌కి వెళ్లేది. అక్కడ ముఖం మీద అలసట, నిద్ర ఛాయలు కనిపించకుండా ఉండేందుకు సోడా, పాలు, ఇతర సాఫ్ట్ డ్రింక్స్ బాగా తాగేదాన్నని ఆయేషా చెప్పింది. అక్కడితో ఆగకుండా ఆమె అక్షయ్ సలహా మేరకు సోడాతో ముఖం కడుక్కునేదట! అక్షయ చెప్పాడని సోడాని కళ్లలోకి కూడా పోసుకునేదట! 

నిజంగా సోడాతో ముఖం కడుక్కుంటే నిద్ర రాకుండా ఉంటుందా? అంతకంటే ముఖ్యంగా, సోడాని కళ్లలో పోసుకోవచ్చా? ఏమో, మనకైతే తెలియదు. ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న ఆయేషా జుల్కా మాత్రం ఈ విషయాలు సీరియస్‌గానే చెప్పింది. అక్షయ్ కుమార్ సలహాని ఆమె అప్పట్లో ఎంతో నిక్కచ్చిగా పాటించేదట!

Bollywoodమరిన్ని...