Abn logo
Oct 29 2020 @ 21:42PM

చివరి నిమిషంలో ‘లక్ష్మీ బాంబ్‌’ టైటిల్‌ ఛేంజ్‌

Kaakateeya

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, బ్యూటీ కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'లక్ష్మీ బాంబ్‌'. సౌత్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించిన 'కాంచన' చిత్రాన్ని బాలీవుడ్‌లో 'లక్ష్మీ బాంబ్‌' పేరుతో రాఘవ లారెన్సే రీమేక్‌ చేశారు. అయితే ఇప్పటి వరకు 'లక్ష్మీ బాంబ్‌' అని అధికారికంగా వినిపించిన ఈ టైటిల్‌ని చివరి నిమిషంలో ఛేంజ్‌ చేసినట్లుగా బాలీవుడ్‌ మూవీ క్రిటిక్‌ తరుణ్‌ ఆదర్శ్‌ తెలియజేశారు. ఈ చిత్రానికి 'లక్ష్మీ బాంబ్‌' ప్లేస్‌లో 'లక్ష్మీ' అనే టైటిల్‌ని ఫైనల్‌ చేసినట్లుగా ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 9 నవంబర్‌, 2020న డిస్నీ హాట్‌ స్టార్‌లో ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 


Advertisement
Advertisement