Abn logo
Nov 27 2020 @ 23:03PM

‘అల వైకుంఠపురములో’ క్రేజ్‌ అయిపోయినట్లేనా..

'అల వైకుంఠపురములో..' చిత్రం ఎందరో కోరికలు తీర్చింది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీ హిట్‌ కోసం వేచి చూస్తున్న అల్లు అర్జున్‌ కలను నెరవేర్చిన సినిమా ఇది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుందే కానీ.. సక్సెస్‌ఫుల్‌ చిత్ర హీరోయిన్‌గా చెప్పుకోలేకపోతున్న పూజా హెగ్డే కోరిక తీర్చిన చిత్రమిది. అలాగే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ని తిరిగి లైన్‌లో నిలబెట్టిన చిత్రమిది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫైనల్‌గా మాత్రం ప్రేక్షకుల ఆకలి తీర్చిన చిత్రమిదని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రం విడుదలై దాదాపు సంవత్సరం కావస్తోంది. అయినా కూడా ఈ చిత్రంలోని పాటలు సృష్టిస్తోన్న రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికి క్రేజ్‌ తగ్గినట్లుగా తాజాగా ఈ చిత్రానికి వచ్చిన టీఆర్పీ చూస్తే తెలుస్తుంది. 


వరల్డ్ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఫస్ట్ టైమ్‌ టెలివిజన్‌లో టెలికాస్ట్ అయినప్పుడు 29.4 రికార్డ్ టీఆర్పీ సాధించిన ఈ చిత్రం.. రీసెంట్‌గా దీపావళి రోజున ప్రదర్శితమైనప్పుడు మాత్రం దారుణంగా పడిపోయింది. కేవలం 7.91 టీఆర్పీనే రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే.. రామ్‌చరణ్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రం.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఇప్పటికీ 6కి పైనే టీఆర్పీ సాధిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు అరడజను సార్లకు పైగా ప్రదర్శితమైంది. అయినా కూడా టీఆర్పీ విషయంలో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అలాంటిది ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన 'అల వైకుంఠపురములో..' చిత్రానికి రెండవసారి ప్రదర్శనకే ఇంత తక్కువ టీఆర్పీ రావడం చూసిన వారంతా.. ఈ సినిమా క్రేజ్ ఇక అయిపోయిందని అనుకుంటుండటం విశేషం. లాక్‌డౌన్‌లో ఈ సినిమాని జనాలు విపరీతంగా చూసేశారు. అందుకే ఈ సినిమా టెలివిజన్‌లో టెలికాస్ట్ అయినప్పుడు అంతగా ఎవరూ దృష్టి పెట్టలేదని అనుకోవచ్చు. 

Advertisement
Advertisement
Advertisement