అల్లాదీన్ అద్భుత దీపం పేరుతో వైద్యునికి రెండుకోట్లు టోకరా!
ABN , First Publish Date - 2020-10-29T11:58:07+05:30 IST
బాగా చదువుకున్నవారు సైతం మాయలు, మంత్రాలకు పడిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది.
మీరట్: బాగా చదువుకున్నవారు సైతం మాయలు, మంత్రాలకు పడిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. లండన్ నుంచి వచ్చిన ఒక డాక్టర్‌ను ఇద్దరు మోసగాళ్లు తమ దగ్గర ‘అల్లాద్దీన్ అద్భుత దీపం ఉందంటూ రూ.2.5 కోట్లకు టోకరా వేశారు. ఖైర్‌నగర్ బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ అమిత్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ లాయిక్ ఖాన్... సమీనా అనే మహిళకు చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపధ్యంలో డాక్టర్‌కు ఇస్లాముద్దీన్ అనే మాంత్రికునితో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఉన్న అల్లాద్దీన్ అద్భుత దీపం సాయంతో ఎవరి బాధలనైనా నయం చేయగలనని ఇస్లాముద్దీన్ ఆ వైద్యునికి చెప్పాడు. ఈ మాటలు విన్న ఆ డాక్టర్ తనకు ఆ అద్బుత దీపం కావాలని కోరాడు. ఇందుకోసం విడతల వారీగా ఇస్లాముద్దీన్‌కు రూ. 2.5 కోట్లు చెల్లించాడు. అయితే ఇస్లాముద్దీన్ ఎంతకాలం గడచినా ఆ దీపాన్ని ఇవ్వకపోవడంతో డాక్టర్ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఇస్లాముద్దీన్... సమీనాకు భర్తేనని వెల్లడయ్యింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇస్లాముద్దీన్తో పాటు అతనికి సహకరించిన అనీస్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరినీ విచారిస్తున్నారు.