Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద సాయంలో రసాభాస

చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు

రాయచోటి, నవంబరు 30: రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెలో మంగళవారం చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వరద సాయం పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. వలంటీర్‌ కేవలం వైసీపీ వర్గీయుల పేర్లు మాత్ర మే నమోదు చేశారని ఆరోపిస్తూ.. గ్రామస్థులు నష్టపరిహారం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌ను ఈ కార్యక్రమానికి పిలవకపోవడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. కాగా ఇళ్ల ముందు వాన నీరు ప్రవహిస్తుండంతో పాచిపట్టి ఇబ్బందిగా ఉందని, డ్రైనేజి కాలువలు నిర్మించాలని గ్రామస్థులు చీఫ్‌ విప్‌ను కోరారు. వైసీపీ నాయకులు అడ్డుచెప్పడంతో గొడవ జరిగింది. వెంటనే ఆయన స్పందించి అర్హులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు పోలు సుబ్బారెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు రమే్‌షతో పాటు తహసీల్దార్‌ సుబ్రమణ్యంరె డ్డి, ఎంపీడీఓ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement