భోపాల్: మధ్యప్రదేశ్ కల్తీమద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. మోరీనా జిల్లాలోని మాన్పూర్ పృఽథ్వి, పహావలి గ్రామంలోని సోమవారం రాత్రి కల్తీమద్యం తాగి 14 మృతిచెందిన విషయం తెలిసిందే. ఈఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన మరో ఆరుగురు చికిత్సపొందుతూ బుధవారం చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోరీనా కలెక్టర్, ఎస్పీలను బదిలీచేశారు.