పల్లెల్లో మద్యం దందా

ABN , First Publish Date - 2021-03-05T06:00:55+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులైపారుతోంది.

పల్లెల్లో మద్యం దందా
పెద్దగూడెం గ్రామంలో బెల్టుషాపు కోసం సిట్టింగ్‌ ఇక్కడే..

 - ఇబ్బడిముబ్బడిగా బెల్టు దుకాణాల ఏర్పాటు 

- ఒక్కో గ్రామంలో మూడు నుంచి 

      ఐదు చోట్ల విక్రయాలు

-  వైన్స్‌ షాపులకు అధిక ఆదాయం 

     బెల్టు దుకాణాల నుంచే..

-  గ్రామాలనూ వంతులవారీగా

      పంచుకుంటున్న నిర్వాహకులు

గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులైపారుతోంది. పట్టించుకునే వారే లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా పోతోంది.  ప్రతీ ఊరిలో మూడు నుంచి అయిదు బెల్టు దుకాణాలు ఏర్పాటు చేయడంతో గ్రామ వాతావరణం దెబ్బతింటోంది. కేవలం మద్యం దుకాణాల్లోనే విక్రయాలు జరిగేట్లు చూడాల్సిన ఎక్సైజ్‌ అధికారులు తమకేమీ పట్టన ట్లు వ్యవహరిస్తుండటంతో దుకాణాల నిర్వాహకులు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది.  మద్యం దుకాణదారులు కూడా ఎక్కువ రేట్‌కు బెల్టు దుకాణాలకు విక్రయిస్తుండటంతో వారూ లాభాలు ఆర్జిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి - వనపర్తి)

వనపర్తి జిల్లాలో మొత్తం 255 పంచాయతీలు ఉన్నా యి. అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మద్యం దుకా ణాలు లేవు. మండల కేంద్రాలు, జిల్లాకేంద్రంతోపాటు పె ద్దమందడి మండలం వీరాయిపల్లిలో మాత్రమే  ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేశా రు. గ్రామీణ ప్రాంతాల్లో మద్య నిషేధం పూర్తిగా విధించా ల్సిన బాధ్యత ఎక్సైజ్‌ అధికారులపై ఉన్నా, వారూ  చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో పలు కిరాణ దుకాణా లు బెల్టు షాపుగా మారుతున్నాయి. పట్టణాలకు వెళ్లి తా గొస్తే డ్రంకెన్‌డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడుతామని గ్రామాల్లోనే మద్యం కొనుగోలుకు మందుబాబులు ఇష్టపడుతున్నారు. ధర ఎక్కువైనా సరే, ఖాతాలు పెట్టి మరీ కొనుగోలు చేస్తూ  ఆర్థికంగా చితికిపోతున్నారు. గతంలో సారా దుకాణాలతో ఇలాగే ఇళ్లు గుల్ల చేసుకున్న ప్రజలు.. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారనుకుంటే మళ్లీ బెల్టుషాపుల రూపంలో మరో మహమ్మారి ప్రతీ గ్రామంలో విస్తరిస్తోంది. కిరాణ దుకాణాలు బార్లను తలపిస్తుండటంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. బెల్టుదుకాణాల నిర్వాహకులు ప్రత్యేకంగా గదులను అద్దెకు తీసుకొని మరీ మినీబార్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. 

అధిక ధరలకు విక్రయాలు...

బెల్టు దుకాణాల నిర్వాహకులకు మద్యం దుకాణ దారులు బీరుపై రూ. 5, ఫుల్‌ బాటిల్‌ మద్యంపై రూ. 20 నుంచి రూ. 30 వరకు అధిక ధరలకు విక్రయిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సదరు నిర్వాహకులు ఒక్కో బీరు రూ. 20నుంచి రూ.30, ఒక్కో క్వార్టర్‌ మద్యంపై రూ. 20 నుంచి రూ. 25 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నా రు. గ్రామాల్లో పోటాపోటీగా దుకాణాలు వెలుస్తున్నా.. పట్టించుకునేవారు లేకపోవడం.. అధికారులకు విషయం తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ధరలు ఆకాశాన్నంటున్నాయి. కొన్ని గ్రామాల్లో బెల్టు దుకాణాలు  పాఠశాలల సమీపంలో కూడా ఉన్నాయి. లాకౌడౌన్‌ నుం చి రోజూ రాత్రిపూట పలువురు పాఠశాల్లోనే మద్యం తా గుతూ సీసాలను  పడేస్తుండటంతో  ఇబ్బంది ఎదురవు తోంది. వనపర్తి మండలం పెద్దగూడెం పాఠశాల పక్కనే ఓ బెల్టు దుకాణం ఉండడంతో  మద్యం కొనుగోలు చేసి పాఠశాలలోకి వచ్చి తాగుతున్నారు.  కిరాణం కోసం వచ్చే మహిళలు తాగుబోతుల బాధ భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తామని చెప్పినా తమకు అధికారుల అండదండలు ఉన్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోమని చెబుతుండటం గమనార్హం. 

ప్రత్యేక కౌంటర్లు.. డంపింగ్‌ మద్యం..

మద్యం దుకాణాల్లో బెల్లుషాపుల కొనుగోళ్లకు సం బంధించి ప్రత్యేక కౌంటర్లు పెట్టుకున్నారు. అక్కడ బెల్టు దుకాణాల వారికి ప్రత్యేక ధరలతో మద్యం విక్రయిస్తు న్నారు. ఎక్కువగా అమ్ముడపోయ్యే బీర్లను బెల్టుదుకాణా లకే సరఫరా చేస్తున్నారు.  బెల్టు దుకాణాలకు గతంలో పంచాయతీల్లో వేలం వేసేవారు.. వేలంలో పాడుకున్న ప్ర కారం గ్రామాభివృద్ధికి డబ్బులు ఇవ్వాల్సి ఉండేంది. అయి తే వేలంపాటలపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో వేలంపాటలు నిలిపివేశారు. ఇప్పుడు ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ఏర్పాటు చేసుకుంటున్నా రు. అధికారులు కూడా మామూళ్లు ఇచ్చి ఏర్పాటు చేసు కోమంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 255 పంచాయతీలు ఉంటే కనీసం 400పైచిలుకు మద్యం దుకాణాలు ఉంటాయని సమాచారం. ఇక మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి  తీసుకుపోయిన బాటిళ్లను కొన్ని మాత్రమే కిరాణా దుకాణాల్లో ఉంచుకొని మరికొన్ని వివిధ చోట్ల డంపింగ్‌ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడినా తక్కువ మద్యంతో ఇబ్బంది ఉండదని నిర్వాహకులు భావిస్తున్నారు. అలాగే హోటళ్లు, బిర్యానీ సెంటర్లు కూడా సిట్టింగులకు అడ్డాలుగా మారాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. దాడులు చేసి కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-03-05T06:00:55+05:30 IST