దసరా ఉత్సవాలకు బెజవాడ వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక..!

ABN , First Publish Date - 2020-09-18T22:58:41+05:30 IST

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబరు 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు...

దసరా ఉత్సవాలకు బెజవాడ వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక..!

విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబరు 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు ప్రకటించారు. నేటి నుంచి భక్తులకు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. కొండపైకి రవాణా సౌకర్యం లేదని ఈవో చెప్పారు. నదీ స్నానానికి అనుమతి లేదని, తలనీలాలు రద్దు చేస్తున్నట్లు సురేష్ బాబు ప్రకటించారు. మొదటి రోజు ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు, మిగతా రోజులు ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని ఈవో తెలిపారు. కరోనా నేపథ్యంలో.. దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి రోజుకు 10వేల మందికే అనుమతి ఉన్నట్లు దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు చెప్పారు.


మూలా నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 9 వరకు దర్శన వేళలుగా ప్రకటించారు. 4 వేల టికెట్లు ఉచిత దర్శనానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. 3 వేల టికెట్లు రూ.100 రూపాయలు, 300 రూపాయల టికెట్లను మరో 3వేలు విక్రయించనున్నట్లు దుర్గగుడి చైర్మన్ వెల్లడించారు. టైం స్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలని, 5 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు అనుమతి లేదని దుర్గగుడి చైర్మన్ సోమి నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-18T22:58:41+05:30 IST