ఎండల తీవ్రతపై అప్రమత్తం

ABN , First Publish Date - 2022-04-05T07:08:06+05:30 IST

ఎండల తీవ్రత రోజురోజుకూ ముదురుతున్న నేప థ్యంలో జిల్లా ప్రజలు సర్వత్రా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీఫారూఖీ సూచించారు.

ఎండల తీవ్రతపై అప్రమత్తం
అధికారుల సమావేశంలో ప్రసంగిస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

ఆ నాలుగు గంటలు బయటకు వెళ్లొద్దు ఫ  వైద్యశాఖ సిబ్బంది, మందులతో సిద్ధంగా ఉండాలి

ఉదయం 10:30 లోపే ఉపాధి పనులు

జనసాంద్రత ఉన్నచోట చలివేంద్రాల ఏర్పాటు

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశం

నిర్మల్‌అర్బన్‌, ఏప్రిల్‌ 4 : ఎండల తీవ్రత రోజురోజుకూ ముదురుతున్న నేప థ్యంలో జిల్లా ప్రజలు సర్వత్రా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీఫారూఖీ సూచించారు. ఎండల తీవ్రతపై కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. వచ్చే నాలుగురోజుల్లో ఎండతీవ్రతతో పాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేప థ్యంలో జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ఈ వేసవి సీజన్‌లో వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అవసరమైన మందు లు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లతో కూడిన కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమి క ఆరోగ్యకేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవిసీజన్‌లో ఎండదెబ్బ, వడదెబ్బ అంశాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఎండల తీవ్రతపై చైత న్యం తీసుకురావాలని, 108 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని ఆయన ఆరోగ్య శాఖను ఆదేశించారు. అలాగే ఉపాధిహామీపథకంలో పనిచేస్తున్న కూలీలు ఉదయం 10:30 లోపే పనులు ముగించుకోవాలని సూచించారు. తెల్లవారు జా మునే ఉపాధి కూలీ పనులకు వెళ్లి ఎండతీవ్రత పెరగకముందే ఇళ్లకు చేరు కోవాలని సూచించారు. ఉపాధి పనులు జరిగే ఈ ప్రాంతాల్లో టెంట్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అగ్నిమాపకశాఖ సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలని, అంగళ్లు బజార్లు, జరిగే గ్రామీణ ప్రాంతాల్లోనూ బస్టాండ్‌లో చలి వేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలన్నారు. జిల్లాలో ఎండల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. హరితహారం కింద నాటిన మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్‌ ఎండిపోకుండా పట్ట ణాల్లో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు నీళ్లు పట్టి సంరక్షించాలని సూచించారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల దాకా సాధ్యమైనంతవరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ శాఖలు భాగ స్వామ్యం కావాలని ఆయన ఆదేశించారు. 

నేడు జగ్జీవన్‌ రామ్‌ జయంతి 

నిర్మల్‌ కల్చరల్‌ : బాబు జగ్జీవన్‌ రామ్‌ 115వ జయంతి వేడుకలు మంగళవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. ఈ వేడుకలకు జిల్లాలోని అధికారులు, అనధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. 

Updated Date - 2022-04-05T07:08:06+05:30 IST