ఒమైక్రాన్‌తో అలర్ట్‌

ABN , First Publish Date - 2021-12-06T06:32:04+05:30 IST

కరోనా మహమ్మారి మొదటి, రెండో దశల్లో కరోనా వైరస్‌ చేసిన బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటుండగా ఒమైక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ ఒకింత కలవరింతకు గురిచేస్తోంది.

ఒమైక్రాన్‌తో అలర్ట్‌
ఎల్లారెడ్డిలో రేషన్‌ దుకాణం వద్ద వ్యాక్సినేషన్‌ చేస్తున్న వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది

ఫ 100 శాతం వ్యాక్సినేషన్‌ చేసేందుకు పకడ్బందీ చర్యలు

ఫ ఒమైక్రాన్‌ భయంతో పీహెచ్‌సీలకు పరుగులు పెడుతున్న ప్రజలు

ఫ మొదటి, రెండో డోసులు వేసుకునేందుకు నిర్లక్ష్యం వహించిన వారు సైతం స్వచ్ఛందంగా ఆసుపత్రులకు

ఫ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యుల సూచన

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 5: కరోనా మహమ్మారి మొదటి, రెండో దశల్లో కరోనా వైరస్‌ చేసిన బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటుండగా ఒమైక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ ఒకింత కలవరింతకు గురిచేస్తోంది. అయితే వైరస్‌ తీవ్రత తగ్గిన ప్రతీసారి ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం, వ్యాక్సిన్‌ను రెండు డోసులు వేయించుకోకపోవడంతో వైరస్‌ భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి మొదటి, రెండో దశలో వైరస్‌ తీవ్రతను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ వ్యాక్సిన్‌పై మొదట్లో ప్రజల్లో నెలకొన్న అపోహలతో వ్యాక్సిన్‌ వే యించుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌పైౖ అనేక రకాలుగా ప్రచారం నిర్వహించిన కొందరే కదలివచ్చి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. రెండో సారి కరోనా డేల్టా వేరియంట్‌ విజృంభించడంతో పాటు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదుకావడం, రోజుల వ్యవధిలోని కరోనా భారి న పడిన వారు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఆసుపత్రులకు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు పరుగులు పెట్టారు. అప్పట్లో మొదటి డోసు వేసుకున్న వారు మళ్లీ సెకండ్‌డోస్‌ వేయించుకునేందుకు వెనకడుగు వేయడం ప్రస్తుతం ఒమైక్రాన్‌ అనే వేరియంట్‌ పలు దేశాల్లో విరుచుకుపడుతుందని ప్రచారం జరగడంతో మళ్లీ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఎన్ని వేరియంట్‌లు వచ్చినా ప్రజలు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని, వైరస్‌ ప్రభావం తగ్గిందంటూ కరోనా వ్యాక్సిన్‌ వేయిం చుకోవడంపై నిర్లక్ష్యం వహించారని, మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, శానిటైజర్‌లు వినియోగించకపోవడం లాంటివి చేస్తూ నిర్లక్ష్యం వహించ డం వల్లనే వైరస్‌ ఒకరి నుంచి మరొక్కరికి త్వరగా వ్యా ప్తి చెందుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రజ లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుకోకుంటే మరోమారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు.

ఒమైక్రాన్‌ వేరియంట్‌తో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అలర్ట్‌

కరోనా మహమ్మారి మొదటి, రెండో దశల్లో పాటించిన జాగ్రత్తలకు ప్రజలు కాస్త విరామం ఇచ్చినా వైద్యఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఊరూరా.. వాడవాడలా.. ఇంటింటికీ.. పని ప్రదేశాలకు వెళ్లి ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారిస్తూ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. అయితే ఒమైక్రాన్‌ వేరియంట్‌తో వైద్యఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్ర మత్తం అవ్వడంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ వంద శాతం వ్యాక్సిన్‌ అందేలా చూడాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇంటింటి సర్వే చేస్తూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి వివరాలు, వేయించుకోని వారు ఉంటే వారికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టా రు. ప్రస్తుతం మారోమారు వ్యాక్సినేషన్‌ వేయించుకోని వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జిల్లాలో వంద శాతం మొదటి, రెండో డోసు వ్యాక్సినేషన్‌ చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడు తూ రేషన్‌షాపుల వద్ద వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను చేపడుతున్నారు. అయితే ఒమైక్రాన్‌ వేరియంట్‌ వస్తుందని మొదటిడోసు వ్యాక్సినేషన్‌ తీసుకొని వారు సైతం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారని సమాచారం.

వ్యాక్సిన్‌ తప్పకుండా వేసుకోవాల్సిందే..

ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంతో పాటు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు వేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని రెండో డోసు వేసుకోవాల్సిన సమయం వచ్చినా వేయించుకోకపోవడం తగదని అధికారులు పేర్కొంటున్నారు. మొ దట్లో ఇదే తరహాలో వ్యాక్సిన్‌ వేయించుకోకుండా నిర్లక్ష్యం వహించి కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు పెద్దఎత్తున ఆసుపత్రులకు తరలివచ్చారని దీంతో వ్యాక్సిన్‌ వేసేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ప్రస్తుత ం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ అందు బాటులో ఉందని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అప్పుడే ఏ వేరియంట్‌లు వచ్చినా ప్రాణాపాయస్థితికి చేరుకోకుండా ఉంటారని పేర్కొంటున్నా రు. వ్యాక్సిన్‌ వేయించుకున్నాం కదా అని కొందరు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని వ్యాక్సిన్‌ వేయించుకున్న నిబంధనలు పాటించాల్సిదేనని వైద్యులు అంటున్నారు.


ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందే..

ఫ చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో

కరోనా వైరస్‌పై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నిబ ంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. మొదటి, రెండో డోసు వ్యాక్సినేషన్‌ను వేయించుకోవాలి. కొందరు మొద టి డోసు వేయించుకున్న తర్వాత రెండో డోసు వేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసం కాదు. ప్రతి ఒక్కరూ విఽధిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో పాటు కరోనా నిబంధనలు పాటించాల్సిందే. ప్రస్తుతం వందశాతం వ్యాక్సినేషన్‌ చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం.

Updated Date - 2021-12-06T06:32:04+05:30 IST