పరిసరాల్లో కరోనా రోగులుంటే పసిగడుతుంది

ABN , First Publish Date - 2020-04-09T08:40:41+05:30 IST

మనం ఎక్కడికి వెళ్లినా.. పరిసరాల్లో ఎవరైనా కరోనా రోగులు ఉంటే వెంటనే అప్రమత్తం చేసే సరికొత్త యాప్‌ను యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, కేయూ ల్యూవెన్‌ వర్సిటీ...

పరిసరాల్లో కరోనా రోగులుంటే పసిగడుతుంది

లండన్‌, ఏప్రిల్‌ 8 : మనం ఎక్కడికి వెళ్లినా.. పరిసరాల్లో ఎవరైనా కరోనా రోగులు ఉంటే వెంటనే అప్రమత్తం చేసే సరికొత్త యాప్‌ను యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, కేయూ ల్యూవెన్‌ వర్సిటీ(బెల్జియం) శాస్త్రవేత్తల సంయుక్త బృందం అభివృద్ధిచేసింది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాప్‌లన్నీ లొకేషన్‌ ఆధారంగా కరోనా పాజిటివ్‌ల ఆచూకీని గుర్తించగా, ఈ యాప్‌ మాత్రం బ్లూటూత్‌ ఆధారంగా ఆ సమాచారాన్ని రాబడుతుంది.


ఈ యాప్‌ను వాడే వారి సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని, కేవలం కొవిడ్‌-19 పాజిటివ్‌ ఉన్నవారి కదలికల ట్రాకింగ్‌కు పరిమితమవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. కరోనాసంక్షోభం ముగియగానే బ్లూటూత్‌ ద్వారా యాప్‌లో నిక్షిప్తమైన సమాచారం దానంతట అదే తొలగిపోతుందని భరోసా ఇచ్చారు. వాక్‌ స్వాతం త్య్రం, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న దేశాల్లో యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం లీకయ్యే అవకాశాలుంటాయని, అటువంటి చోట్ల తమ యాప్‌ విశ్వసనీయసేవలు అందించగలదని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-09T08:40:41+05:30 IST