కువైత్‌లో భార‌త విద్యార్థుల‌కు అల్గోన్‌క్విన్ కాలేజీ బంప‌రాఫ‌ర్‌!

ABN , First Publish Date - 2021-06-12T19:37:27+05:30 IST

కువైత్‌లోని తొలి కెన‌డియ‌న్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ఇనిస్టిట్యూట్ అల్గోన్‌క్విన్ కళాశాల తాజాగా భార‌తీయ విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

కువైత్‌లో భార‌త విద్యార్థుల‌కు అల్గోన్‌క్విన్ కాలేజీ బంప‌రాఫ‌ర్‌!

కువైత్ సిటీ: కువైత్‌లోని తొలి కెన‌డియ‌న్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ఇనిస్టిట్యూట్ అల్గోన్‌క్విన్ కళాశాల తాజాగా భార‌తీయ విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ క‌మ్యూనిటీ స‌భ్యుల‌కు స్కాల‌ర్‌షిప్‌తో పాటు ట్యూష‌న్ ఫీజులో రాయితీ ఇస్తామ‌ని పేర్కొంది. బిజినెస్‌, అడ్వాన్స్ టెక్నాల‌జీ త‌దిత‌ర రంగాల్లో ప‌లు డిప్లొమా కోర్సుల‌ను అందిస్తున్న అల్గోన్‌క్విన్.. భార‌త విద్యార్థుల కోసం మూడు స్కాల‌ర్‌షిప్స్‌ను ప్ర‌క‌టించింది. క‌ళాశాల ష‌ర‌తుల‌కు లోబ‌డి, అర్హులైన ఇండియ‌న్ క‌మ్యూనిటీ ద‌ర‌ఖాస్తుదారుల‌కు ట్యూష‌న్ ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తామని అల్గోన్‌క్విన్ యాజ‌మాన్యం తెలిపింది. అలాగే ఎవ‌రైతే 3.5 జీపీఏ సాధిస్తారో వారికి త‌ర్వాతి సెమిస్ట‌ర్‌కు 20 శాతం డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. కళాశాల మూడు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. క‌నుక‌ విద్యార్థులు వారి ట్యూషన్ ఫీజులో 60 శాతం మాత్రమే చెల్లిస్తే స‌రిపోతుంది. స్కాల‌ర్‌షిప్ కోసం భార‌త రాయ‌బార కార్యాల‌యం లేదా క‌ల్చ‌ర‌ల్ అటాచీ ద్వారా భార‌తీయ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

Updated Date - 2021-06-12T19:37:27+05:30 IST